Ira Khan Pre Wedding: అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సంద‌డి, నెట్టింట వైర‌ల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ పిక్స్
Ira Khan Pre Wedding (PIC@ Insta)

Mumbai, DEC 28: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. జనవరి 3, 2024 న అమీర్ కూతురు ఐరా ఖాన్, నుపుర్ శిఖరే వివాహం గ్రాండ్‌గా జరగబోతోంది. వీరి వివాహానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందడిగా జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంట్లో (Aamir Khan Daughter Ira Khan) కొత్త సంవత్సరంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అమీర్ కూతురు ఐరా ఖాన్, ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ఏడడుగులు వేయబోతున్నారు. నవంబర్ 18, 2022 ఈ జంటకు నిశ్చితార్ధం కాగా రెండేళ్ల తర్వాత వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇక అమీర్ ఇంట కూతురి పెళ్లి పనులు (Ira Khan Pre Wedding) శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ఐరా-నుపుర్ శిఖరే పెళ్లికి ముంబయి బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ వేదిక కానుంది. మహారాష్ట్ర సంప్రదాయంలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత రెండుసార్లు రిసెప్షన్ నిర్వహిస్తారని జనవరి 6 నుండి 10 తేదీల మధ్య జరిగే ఈ రిసెప్షన్స్ కోసం ఇప్పటికే అమీర్ ఖాన్ పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రీ-వెడ్డింగ్ (Ira Khan Pre Wedding) సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను ఐరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సితారే జమీన్ పర్’ చేయబోతున్నారు. ఇది స్పానిష్ మూవీ ‘కాంపియోన్స్’ కి రీమేక్ అట. గతంలో ఆయుష్మాన్ ఖురానాతో ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమా డైరెక్ట్ చేసిన ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.