Kajal Aggarwal (Photo Credits: Instagram)

ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా, కమల్ హాసన్ (Kamal Hassan)  కథానాయకుడి ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ (Shankar) 'భారతీయుడు2' (Bharateeyudu2 / Indian2) ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ జరుగుతుండగా ఎవరూ ఊహించని విధంగా బుధవారం ఈ సినిమా సెట్స్‌లో ఘోర ప్రమాదం (Crane Accident)  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 10 మంది సినిమా యూనిట్ సిబ్బందికి గాయాలయ్యాయి. మృతుల్లో డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29) , అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ (34), మరొక అసిస్టెంట్ చంద్రన్ ఉన్నారు. డెరెక్టర్ శంకర్ కు గాయాలైనట్లు సమాచారం

సెట్స్‌లో లైటింగ్ అమర్చుతుండగా ఒక భారీ క్రేన్ 150 అడుగుల ఎత్తునుంచి కింద సినిమా యూనిట్ సభ్యులు ఉన్న టెంట్ పై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనతో మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది.

ప్రమాదం జరిగిన సమయంలో డెరెక్టర్ శంకర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  కూడా స్పాట్ లోనే ఉన్నారు. శంకర్ కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఇక ఈ షాకింగ్ ఘటనపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించారు. ఒక ఊహించని ప్రమాదంలో తన సహచర సిబ్బందిని కోల్పోవడం ద్వారా తనకు కలుగుతున్న బాధ మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఇలాంటి గంభీరమైన సమయంలో వారికి ధైర్యం, శక్తి కలగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Kajal Aggarwal Offers Condolences:

ఇక మరో ట్వీట్ లో తన జీవితం ఏంటో ఒక్క క్షణంలో అర్థమైందని కాజల్ అన్నారు. " గత రాత్రి జరిగిన భయంకరమైన క్రేన్ ప్రమాదంతో ఇప్పటికీ షాక్, నొప్పి, బాధలోనే ఉన్నాను. ఈరోజు ఇలా బ్రతికి ఉండటానికి, ఇక్కడ ట్వీట్ చేయడానికి ఒక రెప్పపాటు క్షణం పట్టింది. ఆ ఒక్క క్షణంలోనే జీవితం అంటే ఏంటి, కాలం విలువ ఏంటో తెలిసొచ్చింది. ఈ జీవితానికి కృతజ్ఞతపూర్వకంగా ఉన్నాను". అని కాజల్ ట్వీట్ చేసింది.

Actress Expresses Disbelief

లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.