మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ పాత్ర పేరు సిద్ధ. తాజాగా సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ ను 'ఆచార్య' చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఆరంభంలో... "ఓం సహనావవతు సహనౌ భునక్తు..." అంటూ శాంతిమంత్రం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్, పూజ హెగ్డేలతో కూడిన సన్నివేశాలు, ఓ వీరోచిత పోరాట దృశ్యం ఈ టీజర్ లో పొందుపరిచారు. 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది.
మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.