అఖండ (Image : twitter)

‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య. బోయపాటితో చేసిన హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’ డిసెంబర్ 2న రిలీజ్ అయింది. సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచంవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌తో సరైన సాలిడ్ సినిమా పడితే బాలయ్య స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసింది ‘అఖండ’. జనవరి 20 నాటికి ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోబోతోంది. యూఎస్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ 50 రోజుల సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. 50వ రోజు సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

50వ రోజు సెకండ్ షోకి బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ‘అఖండ 50 డేస్ జాతర’ హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ షోలో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాల్లోని పాటలు ప్లే చెయ్యబోతున్నారు.