Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru |(Photo Credits: Twitter)

ఈసారి కొత్త సంవత్సరం ఫుల్ ఎనర్జీతో ప్రారంభమైంది. ఇప్పుడిక సంక్రాంతి వేడుకలు దగ్గరపడుతున్నాయి. అలాగే మనం ఎంతగానో ఎదురుచూస్తున్న మన ఫేవరేట్ హీరోల సినిమాలు ఒకేసారి వస్తుండటంతో ఈ సంక్రాతి పండగ సంబరాలు రెట్టింపు కానున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'అల వైకుంఠపురములో' జనవరి 12న కేవలం ఒక్కరోజు తేడాతో విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ పెరిగిపోతుంది. ఈ సంక్రాంతి (Sankranti) బరిలో ఎవరు బ్లాక్ బస్టర్ కొడతారో అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. రెండు సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ రెండు సినిమాలకు కలిపి ఒకేసారి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.  నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు... ఆ చూపులనలా తిప్పుకోనియదు ఈ సినిమా పాటల వీడియోలు

ఇప్పటికే ఈ సినిమాల థియేట్రికల్ ట్రైలర్లు విడుదలయ్యాయి. యూట్యూబ్‌లో ఈ రెండు సినిమాల ట్రైలర్లు టాప్ 1 మరియు టాప్ 2 ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఎవరి ట్రైలర్ బాగుంది అని, ఫ్యాన్స్ మధ్య విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకసారి ఈ రెండు ట్రైలర్లపై విశ్లేషణ చేస్తే;

సరిలేరు నీకెవ్వరు..

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ఫ్రెష్ కామెడీతో ప్రారంభమై, తర్వాత యాక్షన్ లోకి తీసుకెళ్లింది, చివర్లో 'చిన్న గ్యాప్ ఇచ్చాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది' అని మహేశ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చే డైలాగ్ బాగా పేలింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఆర్మీ ఆఫీసర్ గా, కామన్ మ్యాన్ గా మహేశ్ తన సూపర్ స్టార్ నటన కనబరిచినట్లు ట్రైలర్‌లో చూస్తే అర్థమవుతుంది. ఇక రష్మిక మందానతో రొమాన్స్ మరియు కామెడీ, అలాగే విజయశాంతి రీఎంట్రీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసినట్లు ట్రైలర్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్ మీరూ ఒకసారి చూసేయండి.

Sarileru Neekevvaru Trailer

అల వైకుంఠపురములో...

ఇక అల వైకుంఠపురములో ట్రైలర్ విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ నుంచి కామెడీ వరకు అన్ని ఎమోషన్స్‌ను సింగిల్ హాండ్‌తో తీసుకెళ్లినట్లు కనిపిస్తుంది. ఎప్పట్లాగే ఈ సినిమాలో కూడా స్టైలిష్ స్టార్ హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు కొత్తదనం చూపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ డాన్స్ ప్రధాన ఆకర్శణ. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉండనే ఉన్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు టబు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా గురించి పక్కనపెడితే ట్రైలర్ కట్ చేసిన విధానం సరిగా లేక కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుందని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు.

Ala Vaikunthapurramuloo Trailer:

అయినప్పటికీ ఈ ట్రైలర్‌లో చెప్పినట్లు, సినిమా చూస్తున్నపుడు 'విజిల్స్ మాత్రమే కాదు, బద్దలయిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్లోమోషన్, గాల్లో కోట్ ఎగరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ' అన్నీ ఫ్యాన్స్‌ను ఖచ్చితంగా మెస్మరైజ్ చేసేయొచ్చేమో.

మీకు ఏ ట్రైలర్ నచ్చిందో ఈ కింద ఇవ్వబడిన పోల్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాగే అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎవరి ట్రైలర్ ఎక్కువమందికి నచ్చిందో చూడొచ్చు.

సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?