Hyderabad, DEC 01: టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేయబోతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల (Pushpa-2 Release) కానుందని తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన కిస్సిక్ ఐటెంసాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది. మరోవైపు ఇప్పటికే లాంచ్ చేసిన పుష్ప పుష్ప పుష్ప సాంగ్, సూసేకి పాటలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
Peelings Lyrical Video Song Out Now
ఈ మూవీ నుంచి Peelings సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. నెట్టింట దుమ్ము దులిపేస్తుంది. కాగా ఇప్పుడిక ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్, రష్మిక(Rashmika), అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా పీలింగ్స్ సాంగ్ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.
సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.