Allu Arjun Shares Video on X

Hyderabad, NOV 28: తెలంగాణ ప్రభుత్వం పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలన్నా, సినిమాకు ప్రత్యేక అనుమతులు కావాలన్నా ఆ సినిమాలోని మెయిన్ స్టార్స్ తో ప్రజల్లో చైతన్యం కలిగించేలా డ్రగ్స్ కు (Anti Drugs) వ్యతిరేకంగా యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పడంతో స్టార్స్ తమ సినిమాల రిలీజ్ ముందు యాంటీ డ్రగ్స్ వీడియోలు చేస్తున్నారు. త్వరలో డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం అల్లు అర్జున్ (Allu Arjun) డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వీడియో చేసారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 కి కాల్ చేయండి. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం వాళ్ళని శిక్షించడం కాదు వాళ్లకు హెల్ప్ చేయడం అని చెప్పాడు.

Allu Arjun Special Video For Against Drugs

 

అయితే సాధారణంగా ఇలాంటివి హీరోలు గతంలో కెమెరా ముందు నిల్చొని మాములుగా చెప్పారు. కానీ పుష్ప టీమ్ ఒక యాడ్ లా చేసి, ఇందులో కూడా పుష్ప చెప్పాడు అంటూ ప్రమోషన్ లాగా ప్లాన్ చేసి వీడియో చేసారు. దీంతో బన్నీ యాంటీ డ్రగ్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..