Bhagavanth Kesari Trailer: పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణ మాస్ డైలాగ్స్, కేక పుట్టిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్, హన్మకొండలో అట్టహాసంగా వేడుక
Bhagavanth Kesari Trailer (PIC@ Youtube)

Hyderabad, OCT 08: నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది. హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌ ట్రైలర్‌ లాంఛ్‌ చేశారు. నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలే.. అప్పుడే ధునియా నీ బాంచెన్ అంటది అంటూ తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్‌. బిడ్డను ఆర్మీ సెలెక్షన్స్‌ కు పంపే ప్రయత్నం చేసే వ్యక్తి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ఎత్తిన చెయ్యెవనిదో తెలియాలే.. లేచిన నోరెవనిదో తెలియాలే.. మిమ్మల్ని పంపిన కొడుకెవడో తెలియాలే.. అంటూ బాలయ్య చెప్తున్న ఊరమాస్‌ డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

బాలకృష్ణ ఈ చిత్రంలో నేలకొండ భగవంత్ కేసరిగా పక్కా తెలంగాణ యాస, భాషలో మాస్ అవతారాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే టీజర్‌ ద్వారా హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.మరోవైపు భగవంత్‌ కేసరి నుంచి విడుదల చేసిన గణేశ్‌ ఆంథెమ్‌, ఉయ్యాలో ఉయ్యాలా (Uyyaalo Uyyaala Song) నెట్టింట మంచి వ్యూస్ రాబడుతూ.. అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. భగవంత్ కేసరి అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అక్టోబర్‌ 18న యూఎస్‌ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ సరిగమ సినిమాస్ విడుదల చేస్తుంది. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.