బాలయ్య 107వ సినిమా షురూ అయింది. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ను సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ షూటింగులో బాలయ్య పెద్దాయన అనే గెటప్పులో కనిపించారు. క్రాక్ తో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ వర్క్ చేస్తుండటంతో ఫ్యాన్స్ లో క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగాయి. శృతీహాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి పాపులర్ స్టార్స్ కీరోల్స్ ప్లే చేస్తున్నారిందులో.
గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే అనిల్ రావిపూడితో సెట్స్ పైకెళ్తారు బాలయ్య. గతంలోనే అనిల్ రావిపూడికి కమిట్మెంట్ ఇచ్చిన బాలకృష్ణ ఆ సినిమాకు ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోను దిల్ రాజు నిర్మిస్తారనే వార్తలిప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి తర్వాత బోయపాటి శ్రీనుతో నటసింహం అఖండ 2 చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా ప్లాన్ చేస్తున్న బోయపాటి నెక్ట్స్ బాలయ్యనే డైరెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటిల తర్వాత క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేయనున్నారు బాలకృష్ణ.