Kolkata, NOV 20: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బెంగాలి నటి అండ్రిలా శర్మ (Aindrila Sharma Died) (24) మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హౌరాలోని ఓ ఆస్పత్రిలో ఆమె (Aindrila Sharma) ఆదివారం కన్నుమూశారు. చిన్న వయసులోనే అండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కువమంది కార్డియాక్ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించడం చర్చనీయాంశమవుతోంది. అండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో (Cancer) పోరాడి గెలిచారు. బ్రెయిన్ స్ట్రోక్ (brain stroke) రావడంతో ఆమె నవంబరు 1న ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమె పలుమార్లు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.
ఆదివారం మరోసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురవడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా.. అండ్రిలా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
Deeply saddened at the untimely demise of our young artiste Aindrila Sharma.
The talented actress won several accolades including the Tele Samman Award.
My deepest condolences to her family, fans & friends. I pray they find the courage in this hour of grief.
— Mamata Banerjee (@MamataOfficial) November 20, 2022
ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన అండ్రిలా ‘జియోన్ కతి’, ‘ఝమర్’, ‘జిబన్ జ్యోతి’ తదితర బెంగాలీ సీరియళ్లతో నటిగా మంచి గుర్తింపు పొందారు. ‘దీదీ నంబరు 1’, ‘లవ్‌కేఫ్’ వంటి సినిమాల్లో నాయికగా మెప్పించారు. ఇటీవల ‘భగర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.