
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ఫిబ్రవరి 25, శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పవన్ సినిమా ఊహించిన స్థాయిలో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అభిమానులతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులచే కూడా భీమ్లా నాయక్ చిత్రం ప్రశంసలందుకుంటోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. భీమ్లా నాయక్ పై తన అభిప్రాయాన్ని చెప్తూ.. పవన్ కల్యాణ్, రానా లతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. 'భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుపానే' అంటూ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ సినిమాపై పవన్ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యపరిచే విషయం. అలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఆర్జీవీ కూడా పాజిటివ్ గా స్పందించడంతో నెటిజన్లు సైతం అవాక్కయ్యారు.