Bheemla Nayak: భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు, ఓటీటీలో రికార్డు ధరకు దక్కించుకున్న హాట్ స్టార్ డిస్నీ ప్లస్, వామ్మో ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే...
Pawank Kalyan's Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ సైతం నమ్మకంతో ఉంది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లే ఫిబ్రవరి 25న థియేటర్లకు వచ్చేస్తామని ధీమాగా చెప్పేశారు భీమ్లా నాయక్ మేకర్స్. దీంతో ఇండస్ట్రీలో ఒకరకమైన ఉత్కంఠ నెలకొనగా.. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ కోసం ఓటీటీలు పోటీకి దిగి రికార్డు ధరను ఆఫర్ చేశాయట.

Corona in AP: ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, గత 24 గంటల్లో 425 మందికి కరోనా, అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు

ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమాను ఆహాతో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకుందని చెబుతున్నారు. ఇవి రెండూ కలిసి రికార్డు ధరకి భీమ్లా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత ధర చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.