Bheemla Nayak (Image: Twitter)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని.. ‘భీమ్లా నాయక్’ పేరుతో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న క్రేజీ రీమేక్స్‌లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఫిబ్రవరి 25న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అండ్ సాంగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ వదిలారు. పవన్ నక్సలైట్ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు. మరోవైపు డైనమిక్ డానియెల్ శేఖర్‌గా రానా కనిపిస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ న్యూ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.