Megastar Chiranjeevi: బెంగాలీ భాషలో ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..
Megastar Chiranjeevi | Photo - Twitter

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ బెంగాలీ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మెగాస్టార్ ఓ బెంగాలీ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. తెలుగులో అశ్వథ్థామ, భీష్మ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో విలన్ గా పేరు తెచ్చుకున్న బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్త తాజాగా నటించిన బెంగాలీ సినిమా ‘బాబా బేబీ ఓ’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి జిషుసేన్ కు విషెస్ తెలిపారు.

”ఫన్ అండ్ ఎమోషనల్ బెంగాలీ మూవీ ‘బాబా బేబీ ఓ’ ట్రైలర్ ను షేర్ చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా స్నేహితుడు జిషుసేన్ గుప్తాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు జిషుసేన్ గుప్తా. ఆ స్నేహంతో ఆయన బెంగాలీ సినిమా ట్రైలర్ ని షేర్ చేశారు చిరంజీవి.