chiranjeevi (photo-IANS)

Hyderabad, Aug 07: ఇటీవల బ్రో (Bro) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ ఏ కుటుంబానికి చెందింది కాదని, ఎటువంటి అండ లేకుండా చిరంజీవి పరిశ్రమకి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడని, ఆ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా ఎంతో కష్టపడే అభిమానుల మనసు గెలుచుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారని పేర్కొన్నాడు. అభిమానులు ఆదరించకపోతే ఇక్కడ ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా నిలబడలేరని చెప్పుకొస్తూ.. కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో ఎవరు అడ్డు లేరని చెప్పుకొచ్చాడు. తాజాగా దీని పై చిరంజీవి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..“మొన్న పవన్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు ఈ ఇండస్ట్రీ ఏ కుటుంబం సొత్తు కాదు. మా ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్స్ వచ్చారు కదా అని వారితో సినిమాలు చేయమని మేము ఎవర్ని బలవంతం చేయం. ఇండస్ట్రీకి వచ్చి మీ ప్రయత్నం చేయండి. మీలో టాలెంట్ ఉంటే అభిమానుల నుంచి గుర్తింపు రావడాన్ని ఏ కుటుంబం ఆపలేదు. బలగం వేణు, వైవా హర్ష సినిమాలకు నా సహాయం అడిగినప్పుడు నేను చేశాను. ఎందుకంటే పాత తరంతో ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి అంటే కొత్త తరం రావాలి.

కేవలం స్టార్స్ మాత్రమే ఉన్న సమయంలో నేను బిక్కుబిక్కుమని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నా టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్ లు ఇచ్చినా కాదనకుండా చేశాను. అలాంటి నన్ను గుర్తించింది అభిమానులు. వాళ్ళ వల్లే నాకు అవకాశాలు వచ్చాయి. ఆడియన్స్ లో నా మీద ఉన్న ఆదరణ చూసిన ఒక ప్రముఖ వ్యక్తి.. నాకు అవకాశం ఇవ్వడంతో నాకు మరిన్ని సినిమాలు వచ్చాయి. ఆయన ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ దానికి కారణం ప్రేక్షుకులు. వాళ్ళ ఆదరిస్తే ఇక్కడ ఎవరు ఆపలేరు” అంటూ సీరియస్ స్పీచ్ ఇచ్చాడు.