Devara Pre Release Event (Credits: X)

Hyderabad, Sep 23: జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర (Devara). రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్‌ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్‌ ఆదివారం హైదరాబాద్‌ లో  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ ఈవెంట్‌కు (Devara Pre Release Event) జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్‌ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. దీంతో చేసేదేమీలేక నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.

దేవ‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గంద‌ర‌గోళం, అభిమానుల తాకిడితో నిర్వాహ‌కులు ఏం చేశారో తెలుసా

Here's Video:

అప్పటికే ఆగ్రహంగా ఉండటంతో

నిర్వాహకుల చాలీచాలని ఏర్పాట్లపై అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోతున్న పలువురు అభిమానులు ఈవెంట్ రద్దైంది అన్న విషయం తెలియగానే చెలరేగిపోయారు. అక్కడ ఉన్న  ఫర్నీచర్‌, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం