Devara-Poster

Hyderabad, SEP 13: గ్లోబ‌ల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న మూవీ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ సెన్సార్‌ అప్‌డేట్‌ వచ్చింది. సెన్సార్‌ బోర్డు దేవరకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ చిత్రానికి నాలుగు కట్స్‌ సూచించినట్టు సమాచారం. వీటిలో మూడు ప్రకృతి హింసకు సంబంధించినవి కాగా.. నాలుగవది షార్క్‌ విజువల్‌ వచ్చినప్పుడు స్క్రీన్‌పై సీజీఐ మార్క్‌ పెట్టడం.. సీబీఎఫ్‌సీ మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి తన భార్యను కొట్టడం, మరో వ్యక్తిని కత్తికి ఉరేయడం. కొడుకు తన తల్లిని తన్నే సన్నివేశంలో మార్పులు సూచించిందని ఇన్‌సైడ్‌ టాక్.

Here's Tweet

 

ట్రైలర్‌లో అసలెవరు వాళ్లంతా.. కులం లేదు.. మతం లేదు.. భయమే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయంటూ బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌తో సాగే సంభాషణలు.. ఎవరు చేశారిదంతా అంటుంటే.. చాలా పెద్ద కథ సామి.. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ ప్రకాశ్‌ రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్‌ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైరగా నటిస్తున్నాడు.

Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే.. 

ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.