Hyper Aadi (PIC Twitter)

Hyderabad, Aug 06: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో స్టార్ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీని విమర్శించే వారందరికీ గట్టి పంచ్ ఇచ్చాడు. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఆయన సినిమాలు, బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి మాట్లాడే వారందరికి ఆయన రేంజ్ ఏంటో మరోసారి గుర్తు చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా ఇప్పటి స్టార్ హీరోలకు కూడా కష్టమవుతున్న 200 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే హీరో సుమన్, ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని దోషిగా చూపించే పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అలాగే మెగా ఫ్యామిలీని విమర్శించే రామ్ గోపాల్ వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చిరుత ఎంట్రీ ఇస్తే వారసత్వం రంగు పూసి విమర్శించారు. ఇండస్ట్రీ హిట్టులు వస్తే దర్శకుడు కారణం, డిజాస్టర్ అయితే రామ్ చరణ్ కారణం అని చెప్పుకొచ్చారు. వారందరికీ రంగస్థలంతో చరణ్ గట్టి సమాధానం ఇచ్చాడు. చరణ్ ని విమర్శించే వారికీ నేను ఒకటే చెబుతున్నా.. సచిన్ కొడుకు సచిన్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి గారు ఆయన తండ్రి గారికి ఎంత గౌరవం తెచ్చిపెట్టారో, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగి అంతకుమించి సంపాదించిపెట్టాడు.

అలాగే ఈ మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై ప్రతి ఒక్కరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని చిరంజీవి గారు పొలిటికల్ న్యూస్ చూడడం మానేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన తిడితే పట్టించుకోకపోవచ్చు కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి.. మీకు పవన్ గారు గట్టిగా ఇవ్వబోతున్నారు. ఇక ఇద్దరు అన్నదమ్ములు కోసం దేనికైనా ఎదురునిలబడే నాగబాబు గారు గురించి చెప్పాలంటే.. చిరంజీవి గారు వెండితెర పై ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. బుల్లితెర పై అంతమందికి నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. ఫైనల్ గా ఒకటే చెబుతున్నా ఈ ముగ్గురు అన్నదమ్ములను విమర్శించే వారందరికీ కుర్చీ మడత పెట్టి.. బదులిస్తాము