
Hyderabad, Jan 31: 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా (Ileana) అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో (Hospital) ఆమె చికిత్స తీసుకుంటున్న ఫొటోలు (Photos) సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అయ్యాయి. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో తాను ఉన్నానంటూ ఇలియానా చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేసింది. ఇంకోవైపు తన కూతురి ఆమె తల్లి స్పందించారు.
తారకరత్న కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి
ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో, ఆమె డీహైడ్రేషన్ కు గురయిందని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. మరోవైపు ఇల్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.