Hyderabad, April 18: ఈటీవీలో (ETV) ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది (Hyper Aadi) టీంలోని గణపతి (Ganapathi) ఒకడు. ఎక్కువగా గణపతి టీచర్, స్టూడెంట్‌కు సంబంధించిన స్కిట్‌లు వేసేవాడు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వ టీచర్ అయ్యాడు. తాజాగా గణపతికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. 1998లో డీఎస్సీ రాసి అర్హత సాధించిన వారిలో గణపతి కూడా ఉన్నాడు. కాగా పాతికేళ్ల అనంతరం ఇటీవల ఏపి ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో గణపతికి కూడా ఉత్తర్వులు అందాయి. దీంతో ఆయన తన సొంత జిల్లా శ్రీకాకులంలో టీచర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
బడిపంతులుగా మారిన జబర్దస్త్ కమెడియన్....కల నెరవేరిందంటూ ఎమోషనల్? - Jabardasth #ganapathi #teacher #HyperAadi #Jabardasth #Tollywood #TeluguMovie #Telugu #TeluguStophttps://t.co/JOwHN9wFkJ
— TeluguStop.com (@telugustop) April 17, 2023
ఇదే విషయాన్ని గణపతి ఓ ఇంటర్వూలో చెప్పాడు. నా పాతికేళ్ల కల నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల నేటికి నెరవేరింది. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపాడు.