Kajal Glimpse Video (PIC@ Youtube)

Hyderabad, June 18: టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) కొత్త సినిమా అప్‌డేట్‌తో అభిమానులకు ముందుకొచ్చింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్‌ Kajal60 టైటిల్ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి సత్యభామ (Satyabhama)టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. పవర్‌ ఫుల్‌ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా సెల్‌లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన కాజల్‌..నిందితుల నుంచి నిజాన్ని రాబట్టేందుకు తన పంచ్ పవర్‌ ఏంటో చూపిస్తోంది. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో సినిమా ఉండబోతుందని గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. భయంతో పరిచయం లేని పోలీసాఫీసర్‌ సత్యభామ ప్రపంచంలోకి Aurum Arts మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తోంది.. అంటూ లాంఛ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా నిర్మిస్తుండగా.. అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నాడు.

కాజల్ అగర్వాల్‌ మరోవైపు శంకర్‌, కమల్ హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఇండియన్‌ 2లో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో ఉమ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాకు కూడా సైన్ చేసింది కాజల్‌. నంద‌మూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఎన్‌బీకే 108 (NBK 108)గా వస్తున్న భగవంత్ కేసరి చిత్రంలోనూ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది కాజల్‌.