 
                                                                 Ayodhya, JAN 21: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించింది. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్న కంగనా రనౌత్ ఆదివారం స్ధానిక హనుమాన్ గర్హి ఆలయ పరిసరాలను శుభ్రం చేసింది (Kangana Ranaut Sweeps Floor). రెడ్ శారీలో సంప్రదాయబద్దంగా తయారైన కంగనా ఆలయాన్ని శుభ్రం చేస్తున్న ఫొటోలు, వీడియో క్లిప్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా వారిని చైతన్యపరచాలని తాను కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర నాసిక్‌లోని కాళారామ్ ఆలయ ఆవరణను శుభ్రం చేసిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇక 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పెద్దసంఖ్యలో విశిష్ట అతిధులు హాజరు కానుండటంతో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
