Keerthy Suresh Wedding Invitation

Chennai, DEC 05: మహానటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌తో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం జరిపిన ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కీర్తితో పాటు ఆమె తండ్రి సురేశ్‌కుమార్‌ కూడా ధృవీకరించాడు. ఈ వేడుకకు గోవా వేదికగా మారనుందని కూడా చెప్పారు. తాజాగా కీర్తి- ఆంటోని లగ్న పత్రిక ఇదేనంటూ ఓ వెడ్డింగ్‌ కార్డ్ (Keerthy Suresh Wedding Invitation)‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్‌ 12న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ఇట్లు జి.సురేశ్‌కుమార్‌, మేనక సురేశ్‌ అని అందులో రాసుంది.

Keerthy Suresh Wedding Invitation

 

ఇకపోతే కీర్తి ఇటీవలే తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది. పదిహేనేళ్ల ప్రయాణం.. ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంటోనితో కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ మూవీ బేబీ జాన్‌ డిసెంబర్‌ 25న విడుదల కానుంది.