
మహానటి ఫేం హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై సందడి చేస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రాన్ని జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.