Mahesh Babu Remuneration: ఫోన్ పే లో ఆ వాయిస్ చెప్పినందుకు మ‌హేష్ బాబుకు ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇచ్చారో తెలుసా? ఫోన్ పే కొత్త యాడ్ లో మహేష్ బాబు యాక్టింగ్ వీడియో మీకోసం
Phone Pe Voice by Nahesh Babu (PIC@ X)

Hyderabad, FEB 24: కరోనా మహమ్మారి అనంతర దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు (Digital)పెరిగిన విషయం తెలిసిందే. జాతీయ రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఫోన్ పే (Phone pay), గూగుల్‌పే, పేటీఎం చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆన్‌లైన్ యూపీఐ చెల్లింపు సంస్థలు అన్ని వారి లావాదేవీల కోసం సోంత స్మార్ట్ స్పీకర్ల‌ను తీసుకువ‌చ్చాయి. యూపీఐ (UPL) ద్వారా చెల్లింపు చేస్తే.. రిసీవుడ్ అని వాయిస్ వినిపిస్తుంది. అయితే ఫోన్‌పే కూడా ఇంతకుముందు లావాదేవీల కోసం కంప్యూట‌ర్ వాయిస్‌ను (Phone pay Voice) వాడుకునేది. కానీ తాజాగా ఫోన్‌పే టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబుతో (Mahesh Babu) టైఅప్ అయ్యింది. దీంతో ఫోన్ పే ద్వారా మ‌నం చెల్లింపు చేస్తే.. మహేశ్ బాబు వాయిస్ వినిపించ‌నుంది. ఉదాహరణకు.. ఫోన్ పేలో చెల్లింపు చేస్తే.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేశ్ బాబు చెబుతాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇది కొత్త‌గా వ‌చ్చింది కాదు. గతంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఇదే తరహాలో వాయిస్‌ను అందించారు. ఆ తర్వాత వాయిస్‌ ఇచ్చిన నటుడు మహేశ్‌ బాబే.

 

అయితే ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం (Remuneration) చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఏంటి సామి ఈ క్రేజ్ అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.