Mahesh Babu as Indian Army Major avatar for his upcoming film 'Sarileru Neekevvaru'.

మొన్న 'శ్రీమంతుడు'లో ఊరిని దత్తత తీసుకున్నాడు, ఆ తర్వాత 'భరత్ అనే నేను' సినిమాతో సీఎంగా రాష్ట్రాన్నే దత్తత తీసుకున్నాడు, నిన్న 'మహర్షి' సినిమాతో గ్లోబల్ లీడర్ గా ఎదిగాడు. ఇప్పుడు భారత ఆర్మీ మేజర్ గా 'సరిలేరు నీకెవ్వరు'అంటూ దేశాన్నే దత్తత తీసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు ఆగష్టు 09న మహేశ్ తన 44వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా మహేశ్ (Mahesh Babu) నటిస్తున్న కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'  (Sarileru Neekevvaru) సినిమా యూనిట్ తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సినిమా ఇంట్రో సాంగ్ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో వెనకనుంచి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉండగా, ఆర్మీ దుస్తుల్లో మహేశ్ బాబు ఎంట్రీ ఇస్తూ జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం చూస్తే రోమాలు నిక్కబొడిచేటట్లుగా, నరాల్లో 'అడ్రినల్' ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, మహేశ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'అజయ్ కృష్ణ రిపోర్టింగ్' అంటూ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్. అలాగే విజయశాంతి, బండ్ల గణేశ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లాంటి మంచి యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని నెలల్లో రానున్న సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2020న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.