Chennai, June 22: తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా (Prabhu Deva), స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు దళపతి విజయ్ (Vijay Birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్‌ను (Bday Shots) చూస్తే.. విజయ్ ఇందులో డ్యుయెల్ రోల్లో కనిపించనున్నాడు. ఇక విజయ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఒకే బైక్‌పై ఇద్దరు విజయ్‌లు గన్లతో స్టంట్లు చేస్తూ కనిపించారు.
రీసెంట్‌గా ఈ సినిమా తేదీని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.