మోహన్ బాబు లేటెస్ట్ సినిమా సన్ ఆఫ్ ఇండియా సమయంలో ఈ ట్రోలింగ్ తారాస్థాయికి చేరుకుంది. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై లెక్కలేనిన్ని మీమ్స్, ట్రోల్స్ నెట్టింట్లో కనిపించాయి. ట్రోలింగ్ శృతి మించడంతో మంచు వారి టీమ్ రంగంలోకి దిగింది. ట్రోలర్స్‌ని హెచ్చరిస్తూ ఓ నోటీస్ కూడా విడుదల చేశారు. తమ కుటుంబంపై ట్రోలింగ్ ఆపకపోతే రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు.
“మాజీ పార్లమెంట్ సభ్యులు, నటుడు, నిర్మాత, విద్యా వేత్త అయితే మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా ఈ దాడి మరీ ఎక్కువైంది. మోహన్ బాబు, అతని కుమారుడు మంచు విష్ణు మీద ట్రోలింగ్ శ్రుతి మించడంతో తప్పక ఈ నోటీసులు ఇవ్వడం జరగుతోంది.
యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో దాడి ఎక్కువవగా.. వాటిని తొలగించకపోతే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని, రూ. 10కోట్ల వరకు పరువు నష్టం దావా వేస్తామని మంచు ఫ్యామిలీ హెచ్చరించింది.
సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తామని, పోలీసులను కూడా సంప్రదిస్తామని మంచు గట్టి వార్నింగ్ ఇచ్చారు.” అయితే, కొందరు ట్రోలర్స్ ఈ లేఖను కూడా పోస్ట్ చేసి మంచు కుటుంబంపై పోస్టింగ్‌లు చేస్తున్నారు.