Hyderabad, Nov 5: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై (Devisri prasad)సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime)కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్ భూషన్‌కుమార్ (bhushan kumar)నిర్మాణంలో ‘ఓ పరి’ (o pari)అనే ఆల్బమ్ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. పాట లిరిక్‌లో ‘హరేరామ హరేకృష్ణ’ (hare rama hare krishna) మంత్రాన్ని ఉపయోగించి చిత్రీకరించారని, ఆ పదాలను తొలగించాలని నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! పవిత్రమైన మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణితోపాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ గీతంలోని మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ సలహాతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో నటించిన ఈ ఆల్బమ్‌ను ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగులో ‘ఓ పిల్లా’(O pilla) పేరుతో విడుదల చేశారు. హిందీ వెర్షన్‌ను రణ్‌వీర్‌సింగ్ విడుదల చేశారు.