Hyderabad, OCT 15: విగ్గు గురించి సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవంత్ కేసరి (Bhagavanth Kesari)సినీ యూనిట్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించింది మాట్లాడింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ‘మొన్న ఎవరో అన్నారు.. నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు? (Balakrishna Comments On his Wig) నువ్వు మీసాలకు పెట్టుకుంటావు కదా విగ్గు’ అని చురకలు అంటించారు. భగవంత్ కేసరి సినిమా చాలా హై ఎనర్జీతో ఉంటుందని చెప్పారు. తనకు సరిపోయే కథలనే దర్శకులు తన వద్దకు తీసుకురావాలని అన్నారు.
చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదని, హిట్ అయిన సినిమానే పెద్ద సినిమా అని బాలయ్య చెప్పారు. తనకు తానే పోటీ అని తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు. తన సినిమాలను థియేటర్లలో చూడాలని చెప్పారు. ప్రస్తుత కాలంలో సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తున్నారని అన్నారు. శ్రీలీల (Sreeleela) తెలుగమ్మాయి కావడం మనకు గర్వకారణమని చెప్పారు. శ్రీలీలతో వేదికపై బాలయ్య స్టెప్పులు వేశారు.
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా భగవత్ కేసరి రూపుదిద్దుకుంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్, బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించింది. ఈ నెల 19న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.