![](https://test1.latestly.com/wp-content/uploads/2022/07/Naresh-650x400-380x214.jpg)
Mysore, July 03: సీనియర్ నటుడు నరేశ్ (Naresh) కుటుంబ వివాదం మరింత ముదిరింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్-పవిత్రా లోకేశ్(Pavitra Lokesh) కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న నటుడి భార్య రమ్య అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ గొడవ చేశారు. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకొని నరేష్, పవిత్రలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే రమ్యను చూసిన నరేష్...విజిల్ వేస్తూ అక్కడి వెళ్లిపోయారు. ఆమె ఒక చీటర్ అంటూ కామెంట్స్ చేశారు. పవిత్ర మాత్రం అక్కడి నుంచి లేడీ కానిస్టేబుల్ సాయంతో సైలెంట్ గా వెళ్లిపోయింది.
Me Abandoning all the Works and Going into Theatres ❤️#Naresh #Pavithra pic.twitter.com/4XxissiJLZ
— 🫴𝐏𝐬𝐲𝐂𝐡𝐨𝐰🕊️ (@Wishnuvv) July 3, 2022
నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటి పవిత్రా లోకేశ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకోనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
వాటిపై రమ్య స్పందిస్తూ.. ‘‘నాకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారు. ఇది చట్టరీత్యా నేరం’’ అని వరుస ప్రెస్‌మీట్లలో హెచ్చరించింది. రమ్య చేస్తోన్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని.. డబ్బు కోసం ఆమె తమని బ్లాక్ మెయిల్ చేస్తోందని.. తమ మధ్య మంచి అనుబంధం ఉందని.. నరేశ్, పవిత్ర ఇటీవల వివరణ ఇచ్చారు. రమ్యకు విడాకుల నోటీసులు పంపిన విషయాన్నీ నరేశ్ వెల్లడించారు. గత వారం రోజుల నుంచి నరేశ్ కుటుంబ వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారగా.. తాజాగా జరిగిన ఘటనతో ఇది మరింత ముదిరినట్లు తెలుస్తోంది.