టాలీవుడ్ నేటి తరం అగ్రశ్రేణి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమా నుంచి మరొక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ యొక్క పోస్టర్ ను రాజమౌళి విడుదల చేశారు.
పంచభూతాల్లో ఒకటైన నీటి శక్తితో ఎన్టీఆర్ పాత్రను పోల్చుతున్న రాజమౌళి, ఆ పాత్రను హైలైట్ చేస్తూ కొమరంభీం రూపంలో, అతడి కాళ్ల వద్ద నీటి తరంగాలు ఎగిసిపడుతున్నట్లుగా చేతిలో ఈటెతో, పదునైన చూపులతో ఎన్టీఆర్ నిలబడ్డ తీరు చూస్తే ఎవరైనా అద్భుతం అని అనకుండా ఉండలేరు.
అలాంటి పోస్టర్ విడుదల చేస్తూ .. 'నా భీమ్ హృదయం బంగారం, తిరుగుబాటు జెండా ఎగరేస్తే అతడి ధైర్యం, స్థైర్యం అనిర్వచనీయం' అని అర్థాన్నిచ్చేలా రాజమౌళి ట్వీట్ చేశారు.
My Bheem has a heart of gold.
But when he rebels, he stands strong and bold! 🌊
Here’s @tarak9999 as the INTENSE #KomaramBheem from #RRRMovie.@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/8o6vUi9oqm
— rajamouli ss (@ssrajamouli) May 20, 2021
ఇలాంటి గంభీరమైన పాత్ర చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర తన కెరియర్ లోనే ఒక గొప్ప ఛాలెంజ్ విసిరింది అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన విప్లవ జ్వాల కొమరంభీం. నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.
ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం దొర అల్లూరి సీతారామ రాజు (Ram Charan As Alluri Sitarama Raju) పాత్ర పోషిస్తుండగా, మరో మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR as Komaram Bheem) నటించడం ఊహించుకుంటేనే ఒళ్లంతా రోమాలు నిక్కబొడుస్తాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిసన్ లాంటి బాలీవుడ్ మరియు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.