OG Movie Producer Funny Chat: పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ కు క్రేజీ రిప్లై ఇచ్చిన OG మూవీ ప్రొడ్యూసర్, ఓయ్ రీ రిలీజ్‌కు పవన్ సినిమా అప్‌డేట్ తో లింక్‌ పెడుతూ ట్వీట్
OG Movie Producer Funny Chat (PIC@ X)

Hyderabad, FEB 11: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘They Call Him OG’. డివివి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఆల్రెడీ 75 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ అవ్వడంతో మూవీ షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఆంధ్రాలో ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఓజి బ్యాలన్స్ షూట్ ని పవన్ పూర్తి చేయనున్నారు. ఇది ఇలా ఉంటే, నిర్మాత డివివి సోషల్ మీడియా (DVV) అకౌంట్ పవన్ అభిమానులతో చాలా సరదాగా ఉంటుంటారు. పవన్ ఫ్యాన్స్ తో ఫన్నీగా చాట్ (Funny Chat) చేస్తూ అందర్నీ ఖుషీ చేస్తుంటారు. ఈక్రమంలోనే ఆ మధ్య.. పవన్ అభిమానికి బిర్యానీ పంపించి సర్‌ప్రైజ్ చేశారు. ఇక తాజాగా OG కొత్త పోస్టర్ (OG Poster) గురించి పవన్ అభిమానితో చేసిన ఫన్నీ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది. డివివి నిర్మించిన ‘ఓయ్’ మూవీ ఈ వాలెంటైన్ డేకి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ రీ రిలీజ్ గురించి డివివి తన సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ వేశారు.. ”ఓయ్ ఓయ్ (Oye Re Release) అంటూ కాజువల్ గా పిలిచేరో. ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసేరో” అంటూ పాట లిరిక్స్ ని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కి పవన్ అభిమాని రియాక్ట్ అవుతూ.. ”ఓయ్ ఓయ్ అంటూ OG ఇంకో పోస్టర్ ఇయ్యరో” అంటూ ట్వీట్ చేశారు. అభిమాని చేసిన ట్వీట్ కి డివివి బదులిస్తూ.. ”ఓయ్ ఓయ్ మొన్న వదిలిన పోస్టరే ఎంప్టీ గుండె నిండా నిలిచేరో. ఓయ్ ఓయ్ తరువాత ఎప్పుడన్నా చూద్దాములేరో” అంటూ ట్వీట్ చేశారు.

Viswambhara Update: వీడియో ఇదిగో, జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తున్న చిరంజీవి, విశ్వంభర చిత్రంలో సరికొత్త లుక్‌తో రానున్న మెగాస్టార్ 

ప్రస్తుతం ఈ ఫన్నీ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ కారు పక్కన బ్లాక్ డ్రెస్సులో నిలబడి, చేతిలో టీ గ్లాస్ తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ నాడు విడుదల కాబోతుంది.