Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం

తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ నెల 22న కర్ణాటకలోని యలహంక–రాజన్‌కుంటె స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం (singer Harini Father Dead) లభించింది.

కర్ణాటక పోలీసులు తొలుత ఆయనది ఆత్మహత్యగా భావించినా.. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అక్కడి ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ఏకే రావు శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, అది హత్యేనని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు చెబుతున్నారు. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం (Singer Harini Father Dies) అనుమానస్పద స్థితిలో లభ్యం కావడంతో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఏకే రావు నవంబర్‌ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్‌ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు.

దెయ్యం పేరుతో ముందు అక్కని, తరువాత చెల్లిని 5 ఏళ్ల పాటు రేప్ చేసిన నకీలీ బాబా, భూత వైద్యుడి కొడుకు కూడా అదే పనిగా అత్యాచారం, తండ్రీ కొడుకులిద్దరూ అరెస్ట్

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు.

‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు. ఇక నవంబర్‌ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్‌ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు.

‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 26, 2021 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).