Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Hyd, Nov 25: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన ఓ మహిళ భూత వైద్యుడిని ఆశ్రయించింది. ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దెయ్యం పట్టిందని భయపెట్టి ఆ మహిళను (Two Sisters Raped by Fake baba) లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి సోదరిపైనా కన్నేసిన మాంత్రికుడు.. ఆమెను కూడా లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కా చెల్లెళ్లపై భూత వైద్యుడితో పాటు అతని కుమారుడు సైతం ఐదేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో ఈ దారుణం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ కిషన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళ తల్లి అనారోగ్యంతో 2005లో చాంద్రాయణగుట్టలోని భూత వైద్యుడు సయ్యద్‌ హసన్‌ అక్సారిని ఆశ్రయించింది. అనంతరం తల్లి ఆరోగ్యం కుదుటపడటంతో భూత వైద్యుడి కారణంగానే తల్లి కోలుకుందని నమ్మింది. ఆ తర్వాత ఆ మహిళ కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళపై కన్నేసిన భూత వైద్యుడు... విడాకులు ఇచ్చిన భర్త నీ శరీరంపై మంత్రాలు, బాణామతి చేశాడని నమ్మించి అమె ఇల్లును అమ్మించి వచ్చిన డబ్బులు కూడా కాజేశాడు.

భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురిని బెదిరించి కామవాంఛలు తీర్చుకున్న శాడిస్ట్ తండ్రి, గర్భం రావడంతో రూ. 20 వేలు ఇచ్చి తీయించుకోవాలని హితవు, కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

ఇల్లు అమ్మిన తర్వాత బాధితురాలు సమీపంలోని బండ్లగూడకు తన మకాం మార్చింది. ఆరోగ్యం బాగోలేదని భూత వైద్యుడిని కలుస్తుండటంతో బాణామతి బూచిచూపి ఆమెపై 2016 నుంచి లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. బాధితురాలి వెంట వచ్చిన సోదరిపై కన్నేసిన భూత వైద్యుడు.. తన అక్క భర్త మంత్రాలు చేశాడని నమ్మించి భయపెట్టి ఆమెను కూడా లొంగదీసుకున్నాడు. ఈమెపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

భూత వైద్యుని కుమారుడు సయ్యద్‌ అఫ్రోజ్‌ కూడా సోదరిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌ తెలిపారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి భూత వైద్యులైన తండ్రీ కొడుకులిద్దరినీ అరెస్టు చేసినట్టు డీసీపీ వెల్లడించారు. వీరి నుంచి 3 తాయత్తులు, 10 జీడి గింజలు, సాంబ్రాణి పొడి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నకీలీ బాబాలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.