Hyderabad, July 06: ప్రభాస్ సలార్ టీజర్ (Salar Teaser Out) వచ్చేసింది. బాహుబలి వంటి పాన్ ఇండియన్ హిట్స్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ (Salar Teaser Out) దృష్టి అంతా సలార్ సినిమాపైనే ఉంది. యశ్‌ను రాఖీ భాయ్ అనే పవర్ ఫుల్ రోల్ చూపించిన ప్రశాంత్ నీల్ (Prashant Neel).. రెబల్ స్టార్ ప్రభాస్‌ను (Prabhas) ఏ రేంజ్‌లో చూపిస్తాడో చూడాలని ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్రవారం ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోయారు. టైమ్ ఎప్పుడు అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అన్న టైమ్‌కే టీజర్ రిలీజ్ చేస్తారా? ఆలస్యంగా విడుదల చేస్తే ఎలా అని కంగారు పడిపోయారు. కానీ చెప్పిన టైమ్‌కి సలార్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సలార్ టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ ను (KGF) మించిపోయేలా ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే అంటూ డైలాగ్ మధ్యలోనే ఆగిపోవడం.. ఆ తర్వాత పవర్‌ఫుల్ బీజీఎంతో (salar BGM) ప్రభాస్‌ను చూపించడం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా సలార్‌ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. సలార్ తొలి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్నట్లు ఈ టీజర్‌తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.