Salar

Hyderabad, May 15: కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న చిత్రం సలార్‌ పై (Salaar Movie) చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఆలస్యం (Delay) కావడంతో రిలీజ్‌ వాయిదా పడనుందంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్స్‌ పై చిత్రయూనిట్‌ స్పందించింది.

Adah Sharma Accident: హీరోయిన్ అదాశర్మకు యాక్సిడెంట్, కేరళ స్టోరీ దర్శకుడితో పాటూ కారులో వెళ్తుండగా ప్రమాదం

ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని చిత్రయూనిట్‌ స్పష్టం చేసింది. ‘మా మీద విశ్వాసం ఉంచండి. రిలీజ్‌ డేట్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అనుకున్న తేదీకి వస్తాం. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 28న సినిమా విడుదలవుతుంది’ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.