Vishwak Sen’s ‘Gaami’ trailer a visual treat; out now Watch Video

Hyderabad, FEB 29: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మాట్లాడడానికి కూడా మొహమాట పడే వ్యక్తి అని అందరికి తెలిసిందే. తన సినిమా గురించి కూడా మాట్లాడడానికి సిగ్గుపడే ప్రభాస్, తనకి ఏదైనా సినిమా నచ్చితే.. అది చిన్న చిత్రం అయినా, దాని గురించి మాట్లాడి తనవంతు ప్రమోషన్ చేసి సహాయం చేస్తారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండని ప్రభాస్.. అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర సినిమాల గురించి పోస్టులు వేస్తుంటారు. తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘గామి’ ట్రైలర్ చూసిన ప్రభాస్.. దాని గురించి ఓ ప్రత్యేక వీడియో చేసి మూవీ యూనిట్ కి పంపించారు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ని (Gaami Movie Trailer) నేడు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈ ట్రైలర్ ని ముందుగానే చూసేసిన ప్రభాస్.. ఈ లాంచ్ ఈవెంట్ కి ఒక వీడియో మెసేజ్ ని పంపించారు.

 

ఇక ఆ వీడియోని చిత్ర యూనిట్ అందరి ముందు ప్లే చేశారు. ఆ వీడియోలో ప్రభాస్ (Prabhas Video Message) మాట్లాడుతూ.. “గామి ట్రైలర్ నాకు బాగా నచ్చేసింది. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది. విశ్వక్ సేన్ కూడా బాగా చేశాడు. ట్రైలర్ చూసిన తరువాత నేనే కావాలని ఈ వీడియో మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాను. అంత బాగా నచ్చేసింది ట్రైలర్. మూవీ సూపర్ హిట్ అవుతుంది” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ థియేటర్స్ రిలీజ్ చేయబోతుంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో అఘోరగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.