Naatu Naatu." LIVE at the 95th Oscars (PIC @ Youtube Pixabay)

New Delhi, March 01: తెలుగు సినిమా ఖ్యాతిని విశ్యవ్యాప్తం చేసిన RRR సినిమా...మరో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటికే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది. తాజాగా ఆ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj ,  కాలభైరవ (Kaala Bhairava)లకు మరో అరుదైన అవకాశం దక్కింది. వారు ఏకంగా అకాడమీ స్టేజీ మీద నాటు నాటు సాంగ్ లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నారు. దీనిపై అకాడమీ ట్వీట్ చేసింది. బిఫోర్ ఇండిపెండెన్స్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ – అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ – కొమరం భీమ్ గా నటించారు. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అవుతున్న ఈ మూవీ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అర్ధమవుతుంది. వరల్డ్ వైడ్ గా ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ వెళుతుంది.  ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్‌ కు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), కాల భైరవ పాట (Kaala Bhairava) పాడారు. ఇక ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంది.

మర్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా నేడు లాస్ ఏంజెల్స్ లో 1647 లార్జెస్ట్ సీటింగ్ ఉన్న ఏస్ హోటల్ థియేటర్ లో RRR స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్క్రీనింగ్ కి రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. స్క్రీనింగ్ అనంతరం ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహించనున్నారు.