Rajinikanth Vettaiyan Movie

Chennai. SEP 20: ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’(Vettayan). తెలుగులో వేట‌గాడు (Vetagadu) అని వ‌స్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2024 ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ మ‌న‌సిలాయోతో పాటు సెకండ్ సింగిల్ హంట‌ర్ పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ప్రివ్యూ పేరుతో టీజ‌ర్‌ను పంచుకున్నారు. ఈ టీజ‌ర్ చూస్తే.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ త‌ర్వాత మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మాస్ ప్యాక్‌డ్‌గా ఉన్న ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి.

ఈ సినిమాకు జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను అందించిన అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. లైకా ప్రోడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.