క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ (Image: twitter)

హైదరాబాద్, డిసెంబర్ 26: మెగా ఫ్యామిలీలో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్ ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్​ సహా అల్లు, మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఉపాసన-చరణ్ దంపతులు ఈ వేడుకకు ఆతిథ్య మిచ్చారు. క్రిస్మస్ వేడుకలకు హాజరైనవారిలో సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక దంపతులు, బన్నీ సతీమణి స్నేహ రెడ్డి తదితర కుటుంబ సభ్యులున్నారు. పండుగ ఏదైనా ఒక్కచోట చేరి కలిసికట్టుగా వేడుకలు చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటే.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

ఇటీవలే విడుదలైన 'పుష్ప' పాజిటివ్​ టాక్​తో దూసుకుపోవడం, 'ఆర్​ఆర్​ఆర్'​ రిలీజ్​కు సిద్ధంగా ఉండటం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పండుగను సెలబ్రేట్​ చేసుకున్నారు అల్లు-మెగా వారసులు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోను స్నేహ రెడ్డి షేర్​ చేయగా.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.