Hyderabad, March 26: శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్లకు పైగా ఈ సినిమా సాగుతూనే ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ శరవేగంగా (Game Changer Movie Update) జరుగుతుంది. ఇటీవలే వైజాగ్ లో కొన్ని రోజులు షూట్ చేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ షూట్ నుంచి పలు వీడియోలు, చరణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ (Game Changer Movie Update) హైదరాబాద్ లో జరుగుతుంది. నేడు గచ్చిబౌలిలో కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు. నేటితో ఈ షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తుంది. ఇంకా షూటింగ్ మిగిలి ఉందని, నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ లో ఉంటుందని సమాచారం. దీంతో ఇంకా షూటింగ్ అవ్వలేదా, ఎన్నాళ్ళు చేస్తారు అంటూ చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, సునీల్, అంజలి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ IAS ఆఫీసర్ కి పొలిటీషియన్స్ కి మధ్య అవినీతి గురించి జరిగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. అనే సాంగ్ ని మార్చ్ 27 చరణ్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవ్వొచ్చని సమాచారం. చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.