రాజమండ్రి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ తేజ్ (Image: Twitter)

రాజమండ్రి, ఫిబ్రవరి 15: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC 15 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణెలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ పూర్తయ్యాయి. తాజాగా ఇటీవలే ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. మొన్నటిదాకా రామ్ చరణ్ ముంబైలో ఉన్నాడు. రామ్ చరణ్ ముంబై నుంచి వచ్చాక ఈ సినిమా షూటింగ్ మూడో షెడ్యూల్ మొదలు పెడతామనన్నారు. ఈ లోపే డైరెక్టర్ శంకర్ తో సహా శంకర్ టీమ్ లోని కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్న దోసకాయల పల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

షాకిస్తున్న క్రిప్టోకరెన్సీ రొమాన్స్‌ స్కాం, గత 5 ఏళ్లలో $1.3 బిలియన్లను కోల్పోయిన రసికులు, డేటింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్‌లో ఇరుక్కున్న పలువురు..

తాజాగా హీరో రామ్‌చరణ్‌ ముంబై నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో రామ్ చరణ్ ని చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. నిన్నటి నుంచి RC 15 షూటింగ్ మొదలైందని సమాచారం. ఒక పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలని గోదావరి జిల్లాల్లో చిత్రీకరించనున్నారు. దాదాపు 10 రోజులు ఈ షూటింగ్ ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు.