Rana Daggubati Look in Haathi Mere Saathi Film | Photo: Twitter

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అతికొద్ది మంది నటుల్లో రాణా దగ్గుబాటి (Rana Daggubati) ఒకరు. బాహుబలి, హౌజ్ ఫుల్ 4, ఘాజీ ఎటాక్, దమ్ మరో దమ్ లాంటి చిత్రాలతో నార్త్ ఇండియాలో కూడా రానా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి నటించిన మరో మల్టీలింగ్వల్ ఫిల్మ్ త్వరలో విడుదల కాబోతుంది. హిందీలో "హాథీ మేరే సాతీ"  (Haathi Mere Saathi) టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి బాన్ దేవ్ అనే వీరోచిత పాత్ర పోషించారు. తెలుగులో "అరణ్య" మరియు తమిళంలో "కాదన్" పేరుతో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సినిమా టీమ్ విడుదల చేసింది.

ఈ సినిమా పోస్టర్లో రానా చాలా భిన్నమైన శైలిలో కనిపిస్తున్నాడు. రానా హెయిర్ స్టైల్, గడ్డం కూడా వైల్డ్ లుక్‌తో ఉన్నాయి.

కథ ప్రకారంపచ్చని అడని నరికివేసి, ఆ స్థానంలో ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించాలని ఓ కార్పోరేట్ కంపెనీ ఏర్పాట్లు చేస్తుంది. అదే అడవిలో నివాసం ఉంటూ అడవికి రక్షణగా ఉండే ఓ అడవిబిడ్డ తన ఇల్లు లాంటి అడవిని ఎలా రక్షించుకోగలడు, ఏనుగులు అతడికి ఎలా సహాయం చేస్తాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో రానా లుక్

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో, తమిళ దర్శకుడు ప్రభు సోలమన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2017లోనే ప్రకటించబడింది. ఎట్టకేలకు 3 సంవత్సారాల తర్వాత 2020, ఏప్రిల్ 02న ఈ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.