Salman Khan (Photo Credits: Instagram)

Mumbai, OCT 30: బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు మ‌ళ్లీ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. రెండు కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే చంపేస్తామ‌ని ఆయ‌న్ను బెదిరించారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి ఆ మెసేజ్‌ వ‌చ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ మెసేజ్ (Death Threat) వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ డ‌బ్బులు చెల్లించ‌కుంటే, అత‌న్ని చంపేస్తామ‌ని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వొర్లీ పోలీసులు.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తిపై కేసు బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు. స‌ల్మాన్‌ను (Salman Khan Death Threat) బెదిరించిన కేసులో మంగ‌ళ‌వారం 20 ఏళ్ల వ్య‌క్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

New Death Threat to Salman Khan

 

బాబా సిద్దిక్ కుమారుడు జీషాన్ సిద్దిక్‌తో పాటు స‌ల్మాన్‌ను ఓ వ్య‌క్తి బెదిరించాడు. నిందితుడిని మొహ‌మ్మ‌ద్ త‌య్యాబ్‌గా గుర్తించారు. అత‌న్ని గుర్ఫాన్ ఖాన్ అని కూడా పిలుస్తారు. నోయిడా సెక్టార్ 39లో అత‌ను ఉంటున్నాడు. అక్టోబ‌ర్ 12వ తేదీన బాబా సిద్ధిక్‌ను హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే.