Newdelhi, Nov 8: గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Larence Bishnoi gang) నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తాజాగా మరోసారి బెదిరింపులు (fresh threat) వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ ను ప్రస్తావిస్తూ పాటలు రాసిన రచయితకు నెల రోజుల లోపు తామేంటో చూపిస్తామని గురువారం అర్ధరాత్రి దుండగులు ఓ ఫోన్ కాల్ లో హెచ్చరించారు. వీలైతే ఆ రచయితను రక్షించుకోవాలని సల్మాన్ కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
#SalmanKhan Receives Threat Call, Day After Extortion Call To #ShahRukhKhan
Read More: https://t.co/9PmkemiB00 #TNCards #ThreatCall pic.twitter.com/eVXplEtaba
— TIMES NOW (@TimesNow) November 8, 2024
వరుస బెదిరింపులు
సల్మాన్ ఖాన్ కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. ఆ తర్వాత గత నెల 30వ తేదీన కూడా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఆ తర్వాత గత శుక్రవారం కూడా సల్మాన్ కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇక, మరో నటుడు షారుఖ్ ఖాన్ కు కూడా ఇలాంటి బెదిరింపులే రావడం గమనార్హం. ఇక, వరుస బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భద్రతను పెంచింది.