Sankranti Winner: ఏ సినిమా ఎలా ఉంది? టూ-ఇన్-వన్ రివ్యూ! సంకాంతి విన్నర్ టీజర్ రిలీజ్ చేసిన 'అల వైకుంఠపురములో' యూనిట్, బ్లాక్ బస్టర్ అంటున్న 'సరిలేరు నీకెవ్వరు', రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి
Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru |(Photo Credits: Twitter)

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలతో పాటు, బాక్సాఫీస్ వద్ద అగ్ర హీరోల సినిమాలు సందడి చేస్తాయి. అయితే ఈ సినిమాలో ఎవరు పైచేయి సాధిస్తారు అని ఫ్యాన్స్ మధ్య ఒక పోటీ నెలకొని ఉంటుంది.

ఈ సారి సంక్రాంతి బరిలో రెండు టాలీవుడ్ చిత్రాలు నిలిచాయి. ఒకటి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కాగా, మరొకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'అల వైకుంఠపురములో'. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎలా ఉంది? ఏ సినిమా కలెక్షన్లలో దూకుడు ప్రదర్శిస్తుంది? సంక్రాతి బరిలో ఏ సినిమా పెచేయి సాధించిందో తెలుసుకోవాలంటే ముందు ఈ సినిమాలు ఎలా ఉన్నాయో విశ్లేశిద్దాం.

సరిలేరు నీకేవ్వరు Sarileru Neekevvaru Review:

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక పవర్ ఫుల్ ఆర్మీ మేజర్. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా అతడు కర్నూల్ రావాల్సి వస్తుంది. అయితే అతడు వెళ్లిన ఇంటికి తాళం ఉండటం, అక్కడి పరిస్థితులు చూసి ఆ కుటుంబం ఏదో సమస్యలో ఇరుక్కుందని గ్రహించి, ఆ కుటుంబాన్ని కాపాడాలనే నిర్ణయానికి వస్తాడు. ఆ కుటుంబానికి లోకల్ ఫ్యాక్షనిస్ట్ నుంచి ముప్పు ఉంటుంది. అతడు రాష్ట్ర మంత్రి కూడా, దీంతో మేజర్ అజయ్ ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు అనేది కథాంశం. సింపుల్ గా చెప్పాలంటే బార్డర్ వద్ద శత్రువులతో ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడే సైనికుడు, సమాజంలోని అరాచకశక్తులను ఎలా ఎదుర్కొంటాడనేది కథ.

ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతిది కీలక పాత్రే అయినా, పవర్ ఫుల్ పాత్ర మాత్రం కాదు. అయితే ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక క్యూట్ స్వీట్ హాండ్సమ్ అబ్బాయిని కోరుకునే హీరోయిన్ కు మహేశ్ బాబు లాంటి హీరో ఎదురైతే ఎలా చేస్తుందో రష్మిక తన క్యారెక్టర్ ను పర్ ఫెక్ట్ గా ప్రెసెంట్ చేసింది.

ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే బయటకు వచ్చే ప్రేక్షకులకు మాత్రం ఏదో అసంతృప్తి, ఏదో మిస్ అయిందనే అనిపిస్తుంది. మహేశ్ బాబును ఎంట్రీలోనే ఆర్మీ ఆఫీసర్ గా చూపించినప్పటికీ అంత సీరియస్ నెస్ కనిపించదు. డైరెక్టర్ పూరిగా కామెడీ జోనర్ లోనే కథను నడిపించాడు. గతంలో అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమాను గుర్తుకుతెస్తుంది. అయితే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ అగ్రెసివ్, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం ఫన్నీ. ఇక 'జబర్ధస్త్' లాంటి కామెడీ షోలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ సినిమాలోని కామెడీస్ సీన్స్ ఒక జబర్ధస్త్ ఎపిసోడ్ అన్నట్లు అనిపిస్తుంది. తమన్నా సాంగ్ మినహా మిగతా సాంగ్స్ కథలో ఇమిడి పోతాయి. ప్రేక్షకులకు నచ్చుతాయి. చివరగా ఈ చిత్రానికి మేమిచ్చే రేటింగ్స్ 2.5/5

Sarileru Neekevvaru - BLOCKBUSTER KA BAAP

అల వైకుంఠపురములో- Ala Vaikunthapurramuloo Review

ఈ సినిమా అన్ని ఎలిమెంట్స్ బాగా కుదిరిన ఒక మంచి కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. గొప్పింట్లో పెరగాల్సిన ఒక అబ్బాయి, దేనికి నోచుకొని మిడిల్ క్లాస్ ఇంట్లో, అలాగే మిడిల్ క్లాస్ ఇంట్లో పెరగాల్సిన అబ్బాయి రాజకుమారిడి భోగాలతో గొప్పింట్లో పెరిగితే ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తికరమైన కాన్సెప్టుతో, ఆసక్తికరమైన కథనంతో సినిమా కథ సాగుతుంది. యాక్షన్, కామెడీ డాన్స్ లలో అల్లు అర్జున్ మార్క్ స్టైల్ కనిపిస్తుంది. సుశాంత్ ది అల్లు అర్జున్ కు సమానమైన క్యారెక్టర్ అయినప్పటికీ, అతడి క్యారెక్టర్ పై హీరో క్యారెక్టర్ పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఇక సినిమాలో విలన్ ఉన్నప్పటికీ అతడి పరిధి కొంతవరకే ఉంటుంది. ఆసుపత్రిలో పిల్లలను మార్చి తన కొడుకును గొప్పింట్లో, వారి కొడుకును (అల్లు అర్జున్) ను తన ఇంట్లో పెంచుకొని సాడిజం చూపించే తండ్రి పాత్రనే టెక్నికల్ గా విలన్ అని చెప్పవచ్చు, ఇతడి క్యారెక్టర్ కథను ఆసక్తికరంగా నడిపిస్తుంది.

హీరో క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో మిగతా క్యారెక్టర్స్ చిన్నగా అనిపిస్తాయి. పూజా హెగ్డే గ్లామర్, సీనియర్ నటి టబు స్క్రీన్ ప్రెసెన్స్, థమన్ మ్యూజిక్, అల్లు అర్జున్ డాన్స్ మరియు ఫైట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్స్  3.25/5

Ala Vaikunthapurramuloo - Sankranthi Winner 

సంక్రాంతికి రిలీజైన ఈ రెండు సినిమాలు ఎంటర్టైనింగ్ గానే ఉన్నప్పటికీ, సరిలేరు నీకెవ్వరు సినిమా కథ ఇటీవల కాలంలో అంతకుముందు వచ్చిన చాలా సినిమాల కథల లాగా అనిపించడంతో పబ్లిక్ టాక్ ఎక్కువగా అల వైకుంఠపురములో పేరు ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. అయితే బాక్సా ఫీస్ కలెక్షన్లలో మాత్రం ఈ రెండు సినిమాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నువ్వా- నేనా అన్నట్లు పోరు జరుగుతుంది. 'సరిలేరు నీకెవ్వరు' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 60 కోట్ల గ్రాస్ తో కలెక్షన్లు కొల్లగొట్టగా, అలవైకుంఠపురములో ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ. 55 కోట్ల వరకు ఉంది. విదేశాల్లో అల వైకుంఠపురములో కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. న్యూజిలాండ్ లో బాహుబలి 2 ప్రీమియర్ షో కలెక్షన్లను కూడా అల్లు అర్జున్ మూవీ బీట్ చేసింది. అక్కడ బాహుబలి 2 సినిమాకు 21 వేల డాలర్లు వసూలు అవ్వగా, అల వైకుంఠపురములో  సినిమా 34 వేల డాలర్లను వసూలు చేసింది.

సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?