Newdelhi, March 13: సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023)లో భారతీయ సినిమా (Indian Movie) సందడి మొదలైంది. ఇండియన్ సినిమా బోణీ కొట్టింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ లభించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు (The Elephant Whisperers) ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు. ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’ సినిమాకు ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. చార్లీ మెక్సీ, మాథ్యూ ఫ్రూడ్ దీనిని రూపొందించారు.
నాటు నాటు పాటకు మరో అంతర్జాతీయ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును అందుకున్న చంద్రబోస్
Oscars 2023: India's'The Elephant Whisperers' wins Best Documentary Short Subject #Oscar #Oscar2023 #Oscars2023 #Oscars95 #TheElephantWhisperers #Documentary @guneetm https://t.co/GXf1oTsPaq
— Mid Day (@mid_day) March 13, 2023
ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ‘నాటునాటు’ పాటను పరిచయం చేసి పాట నేపథ్యాన్ని వివరించారు. గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో ఈ పాట పాడగా అమెరికన్ డ్యాన్సర్ అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక, ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా తుది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ ‘నవానీ’ ముందు నిలవలేకపోయింది. ‘బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్’ సినిమాకుగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు లభించింది. ఇక, కోట్లాది మంది భారత సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ‘నాటునాటు’ పాట భవితవ్యం మరికొద్ది క్షణాల్లో తేలనుంది.
బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత కన్నుమూత