Hyderabad, SEP 27: నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న టైగర్ నాగేశ్వరావు (Tiger Nageshwara Rao) సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ (Glimplse) వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని రవన్న ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా (Robin Hood) పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwara Rao) జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
𝗧𝗛𝗘 𝗙𝗘𝗥𝗢𝗖𝗜𝗢𝗨𝗦 𝗧𝗜𝗚𝗘𝗥 𝗪𝗜𝗟𝗟 𝗕𝗘 𝗨𝗡𝗟𝗘𝗔𝗦𝗛𝗘𝗗 🔥#TigerNageswaraRao 🥷 TRAILER OUT ON OCTOBER 3rd 💥💥 pic.twitter.com/L9BpD9G0lh
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 26, 2023
ఇప్పటికే రిలీజైన టీజర్‌కు (Tiger Nageshwara Rao Tesar) వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరుగుతాయని చిత్రీయూనిట్ వెల్లడించింది. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.