Bheemla Nayak Copyright Controversy: కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న భీమ్లా నాయక్, తమన్ చేసిన పనికి నిర్మాతకు తలనొప్పులు..
Pawank Kalyan's Bheemla Nayak

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా.. హీరో , విలన్లుగా రూపొందిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇంతలోనే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చిపడింది. భీమ్లా నాయక్ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఉపయోగించిన ట్యూన్స్ ను తెలుగులో రీమేక్ చేశారు. ఈ ట్యూన్స్ క్రెడిట్ ను మళయాళ సినిమాకు సంగీతం అందించిన జాక్స్ బిజోయ్ కు ఇవ్వకపోవడం పై అతను అసంతప్తిగా ఉన్నాడని తెలుస్తోంది.

దేశ రాజధానిలో దారుణం, తుఫాకీతో బెదిరించి నగ్న వీడియోలు షూట్, ఆ తర్వాత రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్, తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేసిన ఎంబీఏ విద్యార్థి

తనకు క్రెడిట్ రాకపోవడంతో బిజోయ్ ఐపిఆర్ఎస్ (ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాడట. ఈ వివాదంపై తమన్ కానీ, భీమ్లా నాయక్ దర్శక నిర్మాతలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. గతంలో కూడా తమన్ సంగీతం అందించిన పలు సినిమాలపై కాపీరైట్ పడగా.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఈసారి కూడా అదే జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు పవన్ అభిమానులు. లేదంటే సినిమా విడుదల మరింత ఆలస్యంగా అవకాశం లేకపోలేదు.